అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ మూలాలున్న ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడి సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ మనీష్ చడ్డా అనే విద్యార్థి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. అతడు విశ్వవిద్యాలయంలో మెక్కట్చెన్ హాల్లో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడవటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడిరచారు. ఈ కేసుకు సంబంధించి అతి రూమ్మెట్ జి మిస్ (జిమ్మిషా)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడిది దక్షిణ కొరియా. అతడు సైబర్ సెక్యూరిటీ మేజర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. చడ్డా మృతి గురించి షానే కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. పోలీసులు ఈ కాల్ వివరాలను బహిర్గతం చేయలేదు.
కాకపోతే చడ్డాపై అకారణంగా దాడి జరినట్లు మాత్రం పర్డ్యూ విశ్వవిద్యాలయం పోలీస్ చీఫ్ వెల్లడిరచారు. కాల్ వచ్చిన వెంటనే తొలుత జిమ్మిషాను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన హత్య ఇదే. ఈ హత్యపై విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మిచ్ డేనియల్స్ విచారం వ్యక్తం చేశారు. చడ్డా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు మొత్తం ఒక చోట సమావేశమై చడ్డాకు నివాళి అర్పించారు. చడ్డా హత్య జరిగిన రాత్రి విషయాలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో చడ్డా 21వ జన్మదినం ఉందని అతడి స్నేహితులు తెలిపారు. ఆన్లైన్ కాల్లో అతడు అరుస్తున్నట్లు తమకు వినబడిరదని తెలిపారు. చడ్డా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ మిత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో హఠాత్తుగా కాల్లో అతడి కేకలు వినిపించాయి. అయితే అక్కడేమి జరిగిందో తెలియరాలేదు. మర్నాడు నిద్రలేచే సరికి చడ్డా మరణవార్త తెలిసింది అని స్నేహితుడు అర్నబ్ సిన్హా పేర్కొన్నాడు.













