దేశవ్యాప్తంగా పౌరులు కూడా… దీనిపై అప్పుడే సంబరాలు : జెలెన్స్కీ
ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ అభ్యర్థి హోదా దక్కడంపై అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వెలిబుచ్చారు. తమ దేశ భవితవ్యం యూరప్తోనే ముడిపడి ఉందన్నారు. ఈయా తాజా నిర్ణయం రష్యాపై రెట్టింపు ఉత్సాహంతో పోరాడేందుకు తమకు స్ఫూర్తినిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పౌరులు కూడా దీనిపై అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఈయూ సభ్యత్వం కూడా ఇక ఎంతో దూరంలో లేదని చెప్పుకుంటున్నారు. వీలైనంత త్వరగా సభ్యత్వం దక్కితే రష్యా దాడుల నుంచి తమకు శక్తిమంతమైన నాటో కూటమి రక్షణ దొరుకుతుందని వారంటున్నారు. రష్యా మాత్రం ఈ పరిణామాలను తాము మౌనంగా చూస్తూ ఉండబోమని హెచ్చరించింది.













