వారి విడుదల నాకెంతో సంతోషంగా ఉంది.. బైడెన్
హమాస్ చెరలో బందీలుగా ఉన్న తల్లీకూతుళ్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. మానవతా కోణంలో భాగంగా తల్లీకూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ దేశంలో ఉన్న హమాస్ రాజకీయ కార్యాలయంతో అమెరికన్ల విడుదలపై సంప్రదింపులు జరిపిన కతార్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై హమాస్ గ్రూప్ మెరుపుదాడి చేసిన సమయంలో వారి చేతిలో బందీలుగా మారిన ఇద్దరు అమెరిక్లను రక్షించాం. వారిద్దరితో నేను మాట్లాడాను. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారు. దాదాపు 14 రోజుల పాటు తల్లీకూతుళ్లు భయంకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారి విడుదలపై నాకెంతో సంతోషంగా ఉంది. వారు మరింత కోలుకునేందుకు అమెరికా ప్రభుత్వం సహకరం అందిస్తుంది అని అన్నారు.













