రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అత్యున్నత పురస్కారం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సురినాం అత్యున్నత పౌరపురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ యెల్లో స్టార్ ను ఆ దేశ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోకీ అందజేశారు. రెండు దేశాల బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవ చిహ్నంగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా పరమరిబోని సురినాం అధ్యక్ష భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ తనకు లభించిన ఈ సమున్నత గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు జరిగిన సత్కారంగా అభివర్ణించారు. సురినాంలో కొన్ని తరాలుగా స్థిరపడిన నభారతీయులకు దానిని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య గాఢమైన మైత్రీబంధాన్ని ఏర్పరచటంలో వీరు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సురినాం అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. సురినాం అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.













