ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా ..మోదీ
ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. దేశంలో ఆయన నాయకత్వాన్ని 76 శాతం ప్రజలు హర్షిస్తుండగా, 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66 శాతం మంది ఆమోదిస్తుండగా 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. జనామోదం విషయంలో ప్రధాని అగ్రస్థానంలో ఉండటంపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.













