ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం
భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన గడగ్ పెల్ గి ఖోర్లోను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకటించింది. ఈ విషయాన్ని భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అందచేస్తున్న మద్దతు, నిస్వార్థ స్నేహానికి గౌరవంగా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. మహోన్నతమైన, ఆధ్మాత్మికవాది అయిన నరేంద్ర మోదీకి స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.













