ఉక్రెయిన్ లో నాన్సీ పెలోసీ రహస్య పర్యటన
రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించేందుకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అత్యంత రహస్యంగా కీవ్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆమె కలుసుకుని, మీరేమీ ఆందోళన చెందొద్దు. మీకు దన్నుగా మేమున్నాం అని ధైర్యంగా చెప్పారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం కొనసాగుతుందని పెలోసీ హామీ ఇచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, రక్షణ మంత్రి ఆస్టిన్ ఇదే విధంగా రహస్యంగా ఉక్రెయిన్ను సందర్శించి జెలెన్స్కీకి సాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిన వారం రోజులకే పెలోసీ పర్యటన చోటు చేసుకుంది.













