భారత్ చేతులు నరికేస్తామంటూ పాక్ ప్రేలాపనలు
సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం పాక్ కి దక్కాల్సిన వాటాపై కన్నేసే వారి చేతులు నరికేస్తాం అంటూ భారత్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మలిక్ వ్యాఖ్యలు చేశారు.
‘‘మా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతినే నరికేస్తామని మేము ఇప్పటికే ప్రకటించాం. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, గత ఒకటిన్నర రెండేళ్లలో రెండుసార్లు ఆచరణలో కూడా చూపించాం. మిమ్మల్ని మేము కాపాడుకోగలమని రెండుసార్లు నిరూపించాం. అయితే ఎగువన వున్న దేశాలు, దిగువన వున్న దేశాల నీటిని ఆపేసే హక్కును ప్రపంచం వారికి ఇచ్చేసిందా? అంటూ భారత్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.
ఒప్పందం ప్రకారం తమకు వచ్చే నీటిని రక్షించుకోవడానికి పాక్ కట్టుబడి వుందని, నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్ కి అనుమతిచ్చేది లేదని మలిక్ అన్నారు. పొరుగు దేశపు ప్రధానమంత్రి నియంత్రణలో ఒక నీటి కుళాయి ఉంది. పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనివ్వనని ఆయన అంటున్నారు’’ అంటూ పరోక్షంగా భారత ప్రధానిని ఉద్దేశించి అన్నారు.సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుందని, దానిని ఏకపక్షంగా నిలిపివేయడం, రద్దు చేయడం లేదా సవరించడం సాధ్యం కాదని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి నొక్కి చెప్పారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా త్రార్ మాట్లాడుతూ.. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమలులో ఉందని, దీనిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం లేదా సవరించడం సాధ్యం కాదని వాదించారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని, భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరూ అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. “నీరు మా జీవనరేఖ.. అలాగే మా రెడ్ లైన్ (లక్ష్మణ రేఖ)” అని ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పటికే స్పష్టం చేశారని త్రార్ గుర్తుచేశారు.
ఇక.. ఇదే విషయంపై పాక్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడారు. 1960 లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమలులో వుందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాక్ కి నీటిపై వున్న హక్కులు కొనసాగుతూనే వుంటాయని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత…
సింధు జలాల ఒప్పందం విషయంలో 2025 లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత, 26 మంది మరణించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ దాడి వెనుక పాక్ మద్దతు వున్న ఉగ్రవాదులే కారణమని భారత్ పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపేస్తున్నట్లు భారత్ కీలక ప్రకటన చేసింది.








