అగ్రరాజ్యం తలచుకొంటే.. ఈ సమస్య పరిష్కారం

జమ్మూ కశ్మీర్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ను కలిసే అవకాశం వస్తే కశ్మీర్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా తలచుకొంటే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కూడా కశ్మీర్‍పై జోక్యం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. పాక్ ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఇమ్రాన్ తాజా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే పురుషులపై దాని ప్రభావం ఉంటుందని, పురుషులు రోబోల మాదిరిగా ఉండలేరంటూ లైంగిక హింసపై ఇమ్రాన్ మళ్లీ నోరు జారారు.