2050 నాటికి 130 కోట్ల మందికి!
మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి రెట్టింపు అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా లక్షలాది మందికి ప్రమాదకర రుగ్మతుల ముప్పు పెరగనుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2021లో 52.9 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారని తెలిసింది. ఈ సంఖ్య 2050 నాటికి 130 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. వీరిలో చాలా మంది అధిక బరువుతో సంబంధం ఉన్న టైప్`2 డయాబెటిస్తో బాధపడతారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది వయోజనుల్లో ఒకరు డయోబెటిస్తో బాధపడుతున్నారు. 2021లో ఈ రుగత్మ కారణంగా 67 లక్షల మరణాలు సంభవించాయి. డయాబెటిస్ నివారణ కోసం పటిష్ట చర్యలు చేపట్టకపోతే ప్రపంచంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోదనలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పరిశోధకుడు కెన్విన్ లియేన్ ఓంగ్ తెలిపారు.













