అమెరికా వాణిజ్య శాఖ మెయిల్ హ్యాక్
చైనా కేంద్రంగా పనిచేసే హ్యాకర్లు అమెరికాలోని అత్యంత కీలకమైన గవర్నమెంట్ ఏజెన్సీలు సహా 25 సంస్థల్లోకి చొరబడినట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ సైబర్ దాడి గురించి తమకు మైక్రోసాఫ్ట్ వెల్లడిరచినట్లు అమెరికా వాణిజ్యశాఖ సెక్రటరీ గినా రైమాండో వెల్లడించారు. డిపార్ట్మెంట్ సిస్టమ్ హ్యాక్ అయినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది అని వాణిజ్యశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిఘా ఉంచామని, అవసరమైనప్పుడు స్పందిస్తామని తెలిపారు.













