అమెరికాలో పెళ్లి… ఆన్‍లైన్‍లో అమ్మానాన్నల ఆశీర్వాదం

శుభకార్యాలైనా, మరేదైనా అన్నీ ఆన్‍లైన్‍లో కానిచ్చేస్తున్నారు. తప్పదు ముహూర్తం టైమ్‍కే మూడు మూళ్లు పడాలి. వధూ వరులిద్దరూ ఉంటే సరిపోతుంది. తాజాగా అమెరికాలో జరిగిన పెళ్లికి అమ్మానాన్న వెళ్లలేకపోయారు. వారి ఇక్కడికి రావడానికి లేదు. వీళ్లు అక్కడికి వెళ్లలేకపోయారు. ఎక్కడి వారు అక్కడే ఉంటూ కూతురి పెళ్లిని ఆన్‍లైన్‍లో వీక్షించారు తెలంగాణ రాష్ట్రంలోని నిజమాబాద్‍కు చెందిన దంపతులు. అబ్బాయిది ఆంధ్ర, అమ్మాయిది తెలంగాణ. ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన కొత్తపల్లి కృష్ణారావు, వాణిశ్రీ దంపతుల కుమార్తె కొత్తపల్లి తనూజ.. గుంటూరుకు చెందిన రవి, పద్మ దంపతుల కుమారుడు కృష్ణ తేజ.. అమెరికాలో ఎంఎస్ చేసి ఇద్దరూ అక్కడే స్థిరపడ్డారు.
ఇరు కుటుంబాల వారు తనూజ, కృష్ణతేజలకు వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో అంతర్జాతీయ విమానాలు తిరిగే పరిస్థితి లేకపోవడంతో వధూవరులు స్వదేశానికి రాలేకపోయారు. అయినా అకునున్న ముహూర్తానికే అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ సెంటర్ టెంపులో జరిగిన వివాహ వేడుకల్లో వధూవరులు ఒక్కటయ్యారు. ఈ వివాహాన్ని వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎల్‍ఈడీ స్క్రీన్‍ప్లే ఈ వేడుకను వీక్షించి ఆశీర్వదించారు.