మార్క్ జుకర్ బర్గ్ భారత్ పర్యటన
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ ఆసియా పర్యటన చేపట్టారు. కుటుంబంతో కలిసి జపాన్ చేరుకున్న ఆయన అక్కడినుంచి దక్షిణకొరియా వెళ్లి ఆ తర్వాత భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు. యాపిల్‌తో పోటీ పడేందుకు ఓ డీల్ కుదుర్చుకోనున్నారు. ఇక, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న జుకర్ అక్కడ సంప్రదాయ కటానా ( కత్తులు) ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు. స్వయంగా కొలిమిలోని ఇనుమును సుత్తితో కొట్టి కత్తిని తయారు చేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యోలోని ఫేస్బుక్ డెవలపర్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.













