యూఎస్ క్యాపిటల్ వద్ద మళ్లీ కలకలం…
అమెరికా వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్స్ వద్ద మళ్లీ కలకలం రేగింది. చెక్‌పోస్ట్ వద్ద వేగంగా దూసుకువచ్చిన ఓ కారు బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం కారులో నుంచి వచ్చిన దుండగుడు పోలీస్ అధికారిని కత్తితో పొడిచారు. వెంటనే స్పందించిన క్యాపిటల్ హిల్స్ పోలీసులు దుండగుడిని కాల్పి చంపారు. గాయపడ్డ పోలీస్ అధికారులను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఎవాన్స్ అనే పోలీస్ అధికారి మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారని యాక్టింగ్ చీఫ్ యోగానంద పిట్ మన్ తెలిపారు. దుండగుడు ఇండియానాకు చెందిన ఓ నల్లజాతీయుడని, ఇస్లాం ఉద్యమానికి కట్టుబడి ఉన్న నోహ్ గ్రీన్‌గా యూఎస్ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రవాదులకు సంబంధముందని భావించట్లేదని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కాంటె పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘటనతో క్యాపిటల్ హిల్స్ భవనాన్ని మూసివేశారు.
క్యాపిటల్ భవనం వద్ద సెనెట్ వైపు ఉన్న ప్రవేశ ద్వారానికి 100 గజాల దూరంలో ఉన్న చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం యూఎస్ పార్లమెంటు సమావేవాలు జరగడం లేదు. సుమారు మూడు నెలల క్రితం, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును పార్లమెంట్ నిర్ధారిస్తున్న సమయంలో, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిట్ల్ భవనంలోకి చొచ్చుకువచ్చి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.













