కమలా హారిస్ నివాసం వద్ద కలకలం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికార నివాసం వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడం కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని మసాచుసెట్స్‌లో లో ఉన్న కమలా హారిస్ అధికార నివాసం వద్ద అత్యాధునిక తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాన్ అంటోనియా ప్రాంతానికి చెందిన పాల్ ముర్రే (31) అనే వ్యక్తి హారిస్ నివాసం వద్ద ఉండటాన్ని గమనించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు. అతడిని పరిశీలించగా లైసెన్స్ లేని అత్యాధునిక తుపాకీ లభ్యమైనట్లు తెలిపారు. మెట్రోపాలిటన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.













