ఈ రెండింటిలో దేనికైనా సిద్ధమే… అమెరికాకు ఉత్తర కొరియా

చర్చలకైనా, ఘర్షణకైనా ఈ రెండింటిలో దేనికైనా సిద్ధమేనని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా ఘర్షణలకు దిగేందుకే ఎక్కువగా తయారవ్వాలని సూచించారు. కొత్తగా వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం పట్ల కిమ్ తన వైఖరిని వెల్లడిస్తూ ఈ ప్రకటన చేశారు. ఉత్తరకొరియా అణు కార్యక్రమంపై ఆ దేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియాతో ఏదో ఒక రూపంలో దౌత్యాన్ని కొనసాగించేందుకు బైడెన్ సర్కార్ కూడా అంతా స్పష్టంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అమెరికా ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పుల్లో ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని బైడెన్ చేర్చారు. దీనిపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.