క్యాట్‌వాక్ చేసిన అమెరికా ఉపాధ్యక్షురాలు సవతి కూతురు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సవతి కూతురు ఎల్లా ఎమాఫ్ న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నది. ఎమాఫ్ క్యాట్వాక్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. దేశాధ్యక్ష ప్రమాణ స్వీకారం వేళ ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ఎమాఫ్.. నెల రోజుల తర్వాత ఫ్యాషన్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఆకట్టుకున్నది. ప్రోన్జా షూలర్ కంపెనీ బ్రాండ్ తరపున ఆమె క్యాట్‌వాక్ చేసింది. కమలా హ్యారిస్ భర్త డగ్ ఎమాఫ్ మొదటి భార్య క్రిస్టిన్ మాకిన్ కూతురే ఎల్లా ఎమాఫ్. ఫేమస్ మాడలింగ్ ఏజెన్సీ ఐఎంజీ మోడల్స్‌తో జనవరిలో ఎమాఫ్ ఒప్పందం కుదుర్చుకున్నది. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం సమయంలో మియూ మియూ కోట్తో వచ్చిన ఎల్లా ఎమాఫ్ అక్కడ అందర్నీ స్టన్ చేసింది. న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నది.













