ఇది మీ పని కాదు.. వేరేవాళ్లు చేశారు : జో బైడెన్
గాజా ఆసుపత్రివద్ద పేలుడుకు ఇజ్రాయెల్ కారణం కాదని, అది మిలిటెంట్ల పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేవమయ్యారు. ఇజ్రాయెల్`హమాస్ యుద్ధం, తాజా పరిణామాలు, గాజా ప్రజలకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చించుకున్నారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఉదంతం ప్రస్తావనకు వచ్చింది. ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ప్రయోగించిన రాకెట్ మిస్‌ఫైర్ కావడం వల్లే ఈ పేలుడు జరిగిందన్న ఇజ్రాయెల్ వాదనతో బైడెన్ ఏకీభవించారు. నాకు అందిన సమాచారం ప్రకారం ఇది మీ పని కాదు. వేరేవాళ్లు చేశారు అని అన్నారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం పట్ల బైడెన్ విచారం వ్యక్తం చేశారు.













