రెండు రాజ్యాలను ఏర్పాటు చేయడమే.. ఈ వివాదానికి

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పోరులో తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాల పరిష్కారమే ఉత్తమమని చెప్పారు. ఇజ్రాయెల్ సరసన స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయడమే ఆ ప్రాంతలోని ఘర్షణలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అలాగే జెరూసలేంలో మతకలహాలను ఆపాలని ఇజ్రాయెల్‍ను కోరినట్లు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ భద్రత పట్ల తన నిబద్ధత విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రాంతీయ దేశాలు నిర్ద్వంద్వంగా గుర్తిస్తే తప్ప శాంతి నెలకొనదని బైడెన్ అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్ తో పాటుగా సౌర్వభౌమాధికారాలు గత పాలస్తీనా ఏర్పాటు అనే రెండు దేశాల పరిష్కారం దశాబ్దాలుగా అంతర్జాతీయ దౌత్య పరిష్కారంగా ఉన్నదని గుర్తు చేశారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా విధానం పూర్తి ఏకపక్షంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గిందని విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు బైడెన్ సమతూక విధానం ప్రకటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయి సార్వభౌమాధికారం కలిగిన రెండు రాజ్యాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.