ఇది చరిత్రలో నిలిచిపోయే సంఘటన… తెలుగు భాషకు
తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది తెలుగు వారందరూ గర్వపడాల్సిన విషయమని విశ్వ తెలుగు సాహిత్య సాంస్కృతిక సభ అధ్యక్షుడు వల్లూరి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వల్లూరి రమేశ్ మాట్లాడుతూ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఏప్రిల్ 12న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సంస్కృతి వారసత్వ దినంగా అధికారికంగా గుర్తించారని తెలిపారు. దీంతో అమెరికాలోని పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలు తెలుగులో బోధించేందుకు వీలు కలిగిందన్నారు. జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషను బోధించవచ్చన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ కెంపె అంతర్జాతీయ తెలుగు దీప్తి బిరుదును అందజేయడం సంతోషకరమని అన్నారు. జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషకు గొప్ప సత్కారం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సంఘటన అని ఆయన తెలిపారు.













