భారత విద్యార్థులకు రష్యా ఆఫర్
యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారత విద్యార్థులు తమ దేశంలో చదువు కొనసాగించొచ్చని రష్యా ప్రకటించింది. భారత విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండానే వైద్య విద్యను పూర్తి చేయొచ్చని న్యూఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబుప్కిన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో విద్యార్థులు స్కాలర్‌షిప్‌పై విద్యనభ్యసించి ఉంటే కొన్ని రష్యా వర్సిటీలు దాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే ఉక్రెయిన్ ఫీజులతో పోలిస్తే రష్యా వర్సిటీల ఫీజులు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అని కేరళలోని రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యుడు రతీశ్నాయర్ తెలిపారు. యుక్రెయిన్ నుంచి 20 వేల మంది భారత వైద్య విద్యార్థులు రష్యా దాడుల తర్వాత ఆపరేషన్ గంగలో భాగంగా భారత్ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.













