తక్షణమే ఆ దేశానికి వీడాలి…ఎంబీసీ తాజా హెచ్చరిక
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్లోని భారత విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కోసం ఎదురు చూడకుండా తక్షణమే ఆ దేశానికి వీడాలని సూచించింది. మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. మెడికల్ యూనివర్సిటీల్లో ఆన్లైన్ క్లాసుల గురించి తెలుసుకోవడానికి భారత రాయబార కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అయితే భారత విద్యార్థులు తమ విద్యాప్రక్రియను కొనసాగించడానికి వీలుగా ఆన్లైన్ క్లాసుల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. క్లాసుల విషయంలో యూనివర్సిటీల నుంచి అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురు చూడకండి. మీ భద్రత దృష్ట్యా తక్షణమే దేశానికి వీడాలని సూచిస్తున్నాం అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.













