భారత్ లో నిబంధనలు కఠినం : ఎలాన్ మస్క్
భారత్లో సోషల్ మీడియా విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు కఠినంగా ఉన్నాయని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ట్విటర్ బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల గురించి తనకు తెలియదన్నారు. భారత్లో ట్విటర్ కంటెంట్ మార్పులపై తన వద్ద ఖచ్చితమైన సమాచారం లేదన్నారు. భారత్లో సోషల్ మీడియాలో నిబంధనలు మాత్రం కఠినంగా ఉన్నాయన్నారు. తాము ఆ దేశ చట్టాలకు విరుద్ధంగా వెళ్లబోమన్నారు. నిబంధనలు అమలు చేయడమా, తమ సిబ్బంది జైలుకు వెళ్లడామా అంటే తాను నిబంధనలు పాటించేందుకే మొగ్గు చూపుతాయని తెలిపారు. బీబీసీ తీసిన డాక్యుమెంట్లో ఏం ఉందో తాను చూడలేదన్నారు.













