కరోనా సేవలకోసం 10 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించిన ఖోస్లా కుటుంబం

కరోనా సెకండ్‍వేవ్‍లో అల్లాడుతున్న భారత్‍ను ఆదుకునేందుకు అమెరికాలో ఉంటున్న పలువురు భారత సంతతి ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారత సంతతికి చెందిన బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా కుటుంబం కరోనా సేవలకోసం మరో 10 మిలియన్ డాలర్లు సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సమకూర్చేందుకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని వినోద్ ఖోస్లా ట్విటర్ వేదికగా వెల్లడించారు. గతంలోనే ఈయన వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వసతుల కల్పనకు విరాళాలు అందజేశారు. దానికి తాజాగా ప్రకటించిన 10 మిలియన్ డాలర్ల అదనం కావడం విశేషం. ఇప్పటికే భారత్‍లో కొవిడ్ సహాయార్థం గివ్‍ఇండియాకు ఇస్తున్న ఈ విరాళాలు సరిపోవడం లేదని, ఇంకా సహాయం కావాలని అభ్యర్థనులు వస్తున్నాయని ఆయన చెప్పారు.