ఐరాసలో తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలనే డిమాండుతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. బేషరతుగా బందీలనూ విడుదల చేయాలని తీర్మానం కోరింది. అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఐరాస నిర్వహించింది. అందులో ఈ తీర్మానం ప్రవేశపెట్టగా అద్భుత స్పందన వచ్చింది. తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు ఓటేశాయి. 10 వ్యతిరేకించాయి. 23 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఆస్ట్రియా వ్యతిరేకంగా ఓటేసిన దేశాల్లో ఉన్నాయి. జర్మనీ, హంగరీ, ఇటలీ, ఉక్రెయిన్, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానాన్ని ఈజిప్టు ప్రవేశపెట్టింది.













