పాకిస్థాన్ కు ఐరాసలో భారత్ హెచ్చరిక… వాటిపై ఇప్పటికైనా
ఐరాసలో మరోసారి పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారతదేశం తీవ్రస్థాయిలో ఆక్షేపణ తెలిపింది. పాకిస్థాన్ ఎన్ని ప్రగాల్బాలాలకు దిగినా, ఏకంగా ఎంత మొత్తుకున్నా అసత్యం సత్యం కాబోదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధుల యంత్రాంగం తరపున కౌన్సిలర్ ప్రతీక్ మథూర్ తెలిపారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లు భారత దేశ అంతర్భాగాలు, వీటిని విడదీసి చూపే యత్నాలకు దిగడం కుటిలత్వమే అవుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి వాటిపై ఇప్పటికైనా పాకిస్థాన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.













