క్వాడ్ డ్రైవర్ సీటులో భారత్ …అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి
చతుర్భుజ కూటమి క్వాడ్‌లో భారత్ అత్యంత కీలకమైన డ్రైవర్ సీటులో ఉందని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. దాని తర్వాతి సీటులో అమెరికా ఉందని పేర్కొన్నారు. జైపుర్ సాహిత్య ఉత్సవం (జేఎల్ఎఫ్)లో క్వాడ్, ఇండో పసిఫిక్ కొత్త దార్శనికత అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. క్వాడ్‌లో భారత్‌తో పాటు అమెరికా, జపాన్ ఆస్ట్రేలియా భాగస్వామ్య పక్షాలు. ఈ కూటమి ప్రయాణ మార్గాన్ని నిర్దేశించే విషయంలో జపాన్ ముందు నుంచీ కీలకంగా వ్యవహరిస్తోందని గార్సెట్టి తెలిపారు. ఆస్ట్రేలియా క్వాడ్ అవసరాలను, ప్రయాణ దిశను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని వివరించారు.













