కొత్త ఏడాదికి స్వాగతం పలికిన మొదటి నగరం
ప్రపంచ దేశాలన్ని న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పడానికి సిద్దమవుతోన్నాయి. అయితే తూర్పుదేశం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి నగరంగా నిలిచింది. రాత్రి పన్నెండు గంటలు దాటగానే న్యూజీలాండ్ ప్రజలు పటాసులు కాల్చి కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకుని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కాలమానం ప్రకారం ముందుగా న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ రాష్ట్రం నూతన సంవత్సంలో అడుగుపెట్టింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆక్లాండ్‌లోని ప్రముఖ చారిత్రక, దర్శనీయ ప్రాంతాలన్నీ రంగురంగు కాంతుల దీపాలతో దగదగ మెరిసిపోతున్నాయి. మిరిమిట్లు గొలిపే లైట్లతో అలంకరించబడిన పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి.













