అమెరికా హెచ్1-బీ పునరుద్ధరణ!
హెచ్-1 బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ టెకీలకు ప్రయోజనం కలిగేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా వీసాల పునరుద్ధరణను మళ్లీ ప్రారంభించాలని అమెరికా భావిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టును ఈ ఏడాది చివర్లో ప్రారంభించనుంది. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే అమెరికా పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరట కలగనుంది. 2004 వరకు నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాల ( ఎన్ఐవీ)ను, ముఖ్యంగా హెచ్1 బీలను అమెరికాలోనే పునరుద్ధరించేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని మార్చారు. వీసాల పునరుద్ధరణకు విదేశీ టెకీలు స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అంతేగాక వీసాల పునరుద్ధరణకు చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగులకు వ్యయ ప్రయాసలు లేకుండా స్థానికంగా ఎన్ఐవీ వీసాలను పునరుద్ధరించాలని అమెరికా యోచిస్తోంది.













