యూఎస్ మార్కెట్ లో గ్రాన్యూల్స్ ఔషధం
గ్రాన్యూల్స్ ఇండియా ప్రజోసిన్ హైడ్రోక్లో రైడ్ క్యాప్సూల్స్‌ను యూఎస్ మార్కెట్లో విక్రయించటానికి అనుమతి సంపాదించింది. అధిక రక్తపోటును అదుపు చేయటానికి ఈ మందు వినియోగిస్తున్నారు. ప్రజోసిన్ హైడ్రోక్లోరైడ్ జనరిక్ ఔషధాన్ని 1ఎంజీ, 2ఎంజీ, 5 ఎంజీ డోసుల్లో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చినట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడిరచింది. ఈ మందు యూఎస్‌లో ఏటా 54 మిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదు చేస్తోంది. దీంతో కలిపి గ్రాన్యూల్స్ ఇండియాకు యూఎస్‌లో 46 ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్) అనుమతులు ఉన్నట్లు అవుతోంది.













