జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) కన్నుమూశారు. నారా సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్చాడు. షింజో అబే ఛాతి, మెడలోకి బుల్లెట్లు దిగింది. కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శాయక్తుల ప్రయత్నించారు. మృత్యువుతో పోరాడి ఆయన మృతి చెందినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని ఘటనాస్థలంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షింజో అబే తన ప్రధాని పదవికి 2020లో రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన మాత్రం రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు.













