జెలెన్స్కీని చంపనని నాకు మాట ఇచ్చారు
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు దేశాలపైనే కాదు మొత్తం ప్రపంచంపై యుద్దం ప్రభావం పడింది. అప్పట్లో రెండు దేశాల మధ్య రాజీకుదిర్చేందుకు కొందరు నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. వారిలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ ఒకరు. గతంలో ఆయన మాస్కోకు వెళ్లి పుతిన్‌ను కలిసి, యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. తాజాగా బెన్నెట్ మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాట ఇచ్చారని చెప్పారు. అప్పట్లో పుతిన్‌తో భేటీ అయిన సందర్భంగా జెలెన్స్కీ విషయాన్ని నేను ప్రస్తావించాను. మీరు జెలెన్స్కీని చంపాలని ప్లాన్ చేస్తున్నారా అని అడిగాను. దీనితో చంపనని ఆయన అన్నారు. జెలెన్స్కీని చంపనని మీరు నాకు మాట ఇస్తున్నారా అని మరోసారి అడిగాను. జెలెన్స్కీని నేను చంపను అని పుతిన్ మళ్లీ చెప్పారు అని వివరించారు. పుతిన్ తనకు మాట ఇచ్చిన విషయాన్ని తాను జెలెన్స్కీకి ఫోన్ ద్వారా తెలియజేశానని బెన్నెట్ తెలిపారు. నేను చెప్పేది విను. మీటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను. అతడు నిన్ను చంపడు అని తెలియజేశాను అని తెలిపారు.













