కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మస్క్ మండిపాటు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శపాలు చేస్తోంది. ట్రూడో ప్రభుత్వం ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల ప్రకారం ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విధానంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్కాస్ట్లను అందించే ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థల పై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని గ్లెన్ తెలిపారు. దీనిపై స్పేస్ఎక్స్ అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ట్రూడో పై విరుచుకుపడ్డారు. ట్రూడో వాక్ స్వాంత్రాన్ని అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణిచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు సిగ్గుచేటు అని మస్క్ మండిపడ్డారు.













