ప్రధాని మోదీని అనుసరిస్తున్న ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న టెస్లా అధిపతి, ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ మన ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్లో అనుసరిస్తున్నారని ట్విటర్ హ్యాండిల్ వెల్లడించింది. ట్విటర్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న అంతర్జాతీయ నాయకుల్లో మోదీ కూడా ఒకరు. ఆయనకు 87.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మస్క్ మొత్తం 134 ట్విటర్ ఖాతాలను అనుసరిస్తున్నారు. ఆయన్ను ఏకంగా 134 మిలియన్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. మోదీని మస్క్ ఫాలో అవుతుండటంతో టెస్లా ఫ్యాక్టరీ త్వరలోనే భారత్కు రాబోతోందని ప్రచారం ఊపందుకుంది.













