అవే లేకపోతే నేను చచ్చిపోయే వాడిని : ఎలన్ మస్క్
గతంలో తాను మలేరియా బారిన పడిన ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం నేటి ప్రపంచం చేసుకున్న గొప్ప అదృష్టమని చెప్పిన ఆయన ఆవే తనను మలేరియా నుంచి రక్షించాయని తెలిపారు. ఔషధ కంపెనీలపై ఒక వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్ బదులు ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం మన అదృష్టం. క్లోరోక్విన్, డాక్సీసిక్లైన్ ఇచ్చి ఉండకపోతే నేను మలేరియా వల్ల మరణించి ఉండేవాడిని. అయినప్పటికీ ఔషధాలను పవిత్రంగా భావించడానికి బదులు వాటిని మనం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. శాస్త్ర విజ్ఞాన పునాదులే ప్రశ్నించడంపై ఉన్నాయి. తద్వారా వాస్తవానికి చేరువ అయ్యే ప్రయత్నం చేయాలన్నారు.













