అలాంటి వారెవరైనా దొరికితే… తప్పుకుంటా
ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి నాలుక మడ తేశారు. ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తాను ఇప్పుడే తప్పుకోను అని ప్రకటించారు. ఈ సోషల్మీడియా ప్లాట్ఫాం సీవోగా తాను కొనసాగాలో వద్దో తేల్చండి అంటూ ఆయనే స్వయంగా పోల్ నిర్వహించారు. పోల్లో ఏ తీర్పు వచ్చినా అందుకు కట్టుబడి ఉంటానని పోల్ ప్రారంభిచేటప్పుడు ప్రమాణం కూడా చేశారు. తీరా పోల్ ముగిసే నాటికి ట్విట్టర్ యూజర్లంతా గంపగుత్తగా పదవి నుంచి దిగిపో అంటూ ఓట్లు వేశారు. దీంతో మస్క్ మాట మార్చారు. సీఈవో పదవికి తగిన మూర్ఖుడిని కనిపెట్టేవరకు నేను ఆ పదవిలో ఉంటా అని ట్వీట్ చేశారు.













