ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా కొత్త మీడియా కంపెనీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఆయా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు ముందుగా లీక్ అయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ, బ్లాక్ చెక్ ఎంటిటీ మధ్య పెండింగ్లో ఉన్న విలీన ఒప్పందం గురించి మియామీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలోని ఉద్యోగులు ముందుగానే తెలుసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రాకెట్ వన్ క్యాపిటల్ సంస్థ అధికారులు బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిష్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ట్రంప్ మీడియా టెక్నాలజీ పొందే లాభాలతో పాటు ప్రకటించనున్న లావాదేవీల గురించి వెల్లడించారని తెలిపింది. అంటే ఇంకా పెండింగ్లో ఉన్న ఈ విలీన ఒప్పందం గురించి కీలక విషయాలు బయటకు రావడాన్ని బట్టి చూస్తే ముందుగానే ఈ విషయాలు బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ఇప్పుడు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, రెగ్యులేటర్లు ఈ విషయమై కూలంకషంగా దర్యాప్తు చేయడమే కాకుండా పెండింగ్లో ఉన్న విలీన ఒప్పందం విషయాలను ముందుగానే బహిర్గతం చేసిన వ్యాక్తులతో సహా విచారణ చేయడం మొదలు పెట్టింది.













