అమెరికాలో సంచలనం సృష్టించిన హత్యకు… శిక్ష ఖరారు

అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు కారణమైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‍కు 270 నెలలు (సుమారు ఇరవై రెండున్నర సంవత్సరాలు) జైలు శిక్ష విధిస్తూ అమెరికా న్యాయస్తానం తీర్పు వెలువరించింది. ఇప్పటికే చౌవిన్‍ను దోషిగా నిర్ధారించిన న్యాయస్తానం భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి ఈ తీర్పును వెల్లడించింది. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరిక్ చౌవిన్.. జార్జిఫ్లాయిడ్ మెడపై మోకాలు మోపి కర్కశంగా హింసించి అతని మరణానికి కారణమైన విషయం తెలిసిందే.