అమెరికా కీలక ఈ-మెయిల్స్ ను తస్కరించిన చైనా
అమెరికా విదేశాంగ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని చైనా హ్యాకర్లు తస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే వాణిజ్యశాఖ కార్యదర్శి గినా రైమాండో సహా అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 10 అధికార ఈ`మెయిల్ ఖాతాల నుంచి 60 వేల మెయిల్స్‌ని హ్యాక్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా సెనేట్ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు. దీనిపై అమెరికా సెనేట్ ఉన్నతాధికారులు సెనేట్ సభ్యుడు ఎరిక్ స్కిమిట్కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తాజా అంశం ఆ రెండు దేశాల మధ్య అగ్గి రాజేసేలా ఉంది. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. తాజా పరిణామాలతో అమెరికా ప్రభుత్వానికి ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ భద్రత ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి.













