చైనా అనూహ్య నిర్ణయం.. పాక్కు ఊహించని షాక్
చైనా అనూహ్య నిర్ణయంతో పాక్కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్లోని కాన్సులర్ విభాగాన్ని (దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్లో ఉంటున్న చైనా పౌరులకు జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసి ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్సైట్ లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2013 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా.













