ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పెట్టుబడులకు సహకరించండి
USA California కౌన్సిలర్ జనరల్ అఫ్ ఇండియా(SFO) శ్రీ Dr నాగేంద్ర ప్రసాద్ గారి తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సేవలు, పెట్టుబడుల సలహాదారు, ప్రముఖ NRI శ్రీ చంద్రహాస్ పెద్ధమల్లు గురువారం ఏప్రిల్, 22 న, శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత రాయబార కార్యాలయంలో సమావేశమై చర్చించారు.
– ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో పెట్టుబడులకు గల అవకాశలను, ప్రవాసాంద్రులకు మరియు ఇతర ఔత్శ్యకిక పారిశ్రమికవేత్తలకు గల పెట్టుబడి అవకాశాలను, వారికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇచ్చే ప్రోత్సహకాలను గురించి వివరించారు.
– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మరియు పెట్టుబడుల రంగాలలో గల అవకాశాలను అమెరికా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న వారికీ వివరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కౌన్సిలర్ జనరల్ అఫ్ ఇండియా సంయుకంగా ఒక్క సమావేశం ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరారు.
– ఈ వేదిక ద్వారా రాష్ట్రములో గల అపారమైన పెట్టుబడుల అవకాశాలమీద మరింత సమాచారంతో విశదీకరిస్తామని తెలిపారు.
– ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన, చేస్తున్న Covid -19 కట్టడికి, వైరస్ బారిన పడ్డ ప్రజల కోలుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ పభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు.
– అమెరికాలోఉన్న, తెలుగువారికీ అవసరమైనా వీసా, పాస్పోర్ట్, OCI మరియు అనేక కాన్సులర్ సర్వీసెస్ సేవలలో కౌన్సిలర్ జనరల్ అఫ్ ఇండియా(SFO) వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కరోనా సమయంలో తెలుగువారికీ ఎటువంటి ఎమర్జెన్సీ ఇమ్మిగ్రేషన్ మరియు అవసరమైన ఇతర OCI సేవలను మరింత వేగవంతం చేయగలిగే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
– కాన్సులర్ జనరల్ అఫ్ ఇండియా శ్రీ Dr నాగేంద్ర ప్రసాద్ గారు మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పెట్టుబడులకు గల అవకాశాల పట్ల సంతృప్తి వేయటం చేస్తూ, వాటిని విరివిగా ప్రచారం చేయటానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రంలో శ్రీ ప్రవీణ్ మునుకూరు, శివారెడ్డి ఏనుగు మరియు సురేంద్రరెడ్డి అబ్బవరం మొదలగువారు పాల్గొన్నారు.













