మాస్క్ నిర్ణయాలను తప్పుబట్టిన బిల్ గేట్స్
ట్విటర్ విషయంలో ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆయన కంపెనీ నడిపిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఇది ఒంటెద్డు పొకడలను తలపిస్తోందని విమర్శించారు. సామాజిక మాధ్యమాలు సమాజంలో ఉద్రికత్తలను తగ్గించి, అసత్య సమాచారం వ్యాప్తి జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. కంపెనీలకు సంబంధించిన అమలు చేసే విధానపరమైన నిర్ణయాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను, పోల్స్ కు ప్రాధాన్యత ఉండకూడదని ఆయన తెలిపారు. దాని వల్ల సంస్థలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందన్నారు.













