భారత్ కు సీఐఏ చీఫ్ ను పంపిన జో బైడెన్!
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నిట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు తెలిసింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ గత ఆగస్టులో భారత్‌కు వచ్చినట్లు తెలిసింది. పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బర్న్స్ పర్యటన జరిగిందని తెలిసింది. భారత్‌లోని ఓ అధికారి కనుసన్నల్లోనే పన్నాన్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది.













