స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ అమెరికన్.. చిన్నారుల ఘనత

అమెరికాలో జరుగుతునన స్పెల్లింగ్ బీ కాంపిటీషన్‍లో భారత సంతతి చిన్నారులు సత్తా చాటుతున్నారు. అమెరికా కాంపిటీషన్‍లో ఫైనల్స్కు చేరిన 11 మందిలో తొమ్మిది మంది మన వారే ఉండటం గర్వించదగ్గ విషయం. జులై 8న స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్స్ జరగనుంది. స్పెల్లింగ్ బీ ఫైనలిస్టుల్లో రాయ్ సెలింగ్ మన్, భావన మదిని, శ్రీతన్ గుజాలా, అశ్రీత గాంధారి, అవని జోషి, జైలా అవంత్, వివిన్ష వేదురు, ధృవ్ భారతీయ, విహాన్ సిబల్, అక్షయనీ కమ్మ, చైత్ర తుమ్మల తదితరులు ఉన్నారు. వీరిలో మన తెలుగు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. గత 20 ఏళ్లుగా స్పెల్లింగ్ బీ కాంపిటీషన్‍లో ఇండియాన్ అమెరికన్స్ ఆధిపత్యమే కొనసాగుతోంది. అమరికా జనాభాలో 1 శాతం ఉన్న భారతీయులు ఈ స్థాయిలో రాణిస్తుండటం గమనార్హం. 1999 నుంచి ఇప్పటి వరకు 26 మంది భారత సంతతి చిన్నారులు స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ లో విజేతలుగా నిలిచారు.