కరోనా వ్యాక్సిన్ తీసుకుని… ఏడు కోట్లు గెలుచుకున్నది

కరోనా వైరస్ నివారణలో భాగంగా అందరికీ టీకాలు వేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నది. ఓహియో రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి వ్యాక్సిన్లు తీసుకునే వారిని ఉత్సాహపరిచేందుకు బంపర్ లాటరీ కూడా ప్రవేశపెట్టారు. ఇటీవల తొలి వ్యాక్సిన్ తీసుకున్న ఓ 22 ఏండ్ల అమ్మడికి ఏకంగా రూ.7 కోట్ల జాక్‍పాట్ తగిలింది. ఇంకేం అమ్మడి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అమెరికాలో టీకాలను ప్రోత్సహించడానికి ఐదు వాక్స్-ఎ-మిలియన్ ప్రచారాలలో మొదటి విజేతను ప్రకటించారు. ఇందులో 22 ఏండ్ల అబిగైల్ బుగెన్స్కీ.
కరోనా వ్యాక్సిన్ తీసుకుని లాటరీలో ఏడు కోట్లు గెలుచుకున్నది. మొదట నాతో ఎవరో జోక్ చేశారని అనుకున్నాను. కానీ నేను గవర్నర్ మైక్ డివిన్‍తో మాట్లాడినప్పుడు నిజంగానే నాకు జాక్‍పాట్ లాటరీ వచ్చిందని తెలుసుకున్నాను. ఇప్పుడు నా కండ్ల నుంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి అని అబిగైల్ చెప్పారు. అబిగైల్ మిలియన్ డాలర్లు గెలుచుకోవడంతో ఆమెనంతా ఇప్పుడు మిలియనీర్ అని పిలుస్తున్నారు. అబిగైల్ మెకానికల్ ఇంజనీర్. ఆమె సిన్సినాటికి చెందిన జీఈ ఏవియేషన్ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ సందర్భంగా గవర్నర్ మైక్ డివైన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.