ప్రపంచంలోనే తొలి కరోనా టీకా తీసుకున్న వ్యక్తి ఇకలేరు

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్‍కు చెందిన విలియం షేక్‍స్పియర్(81) అనారోగ్యంతో మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 8న కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి పురుషునిగా రికార్డు సృష్టించారు. యూనివర్సిటీ ఆస్పత్రి కోవెండ్రీ అండ్ వార్విక్‍షైర్‍లో ఆయన జర్మనీకి చెందిన బయోఎన్‍టెక్, అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఇదే ఆస్పత్రిలో చేరిన షేక్‍స్పియర్ ఈ నెల 20న మృతి చెందినట్లు ఆయన మిత్రుడు జైన్ ఇన్నేస్ వెల్లడించారు. వ్యాక్సిన్‍తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కరోనా టీకా తీసుకుని రికార్డు సృష్టించారు.