డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు : కేంద్రం

దేశంలో కరోనా వైరస్ కలవరం పాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు వేరియంట్లు భారత్‍ను చుట్టుముడుతున్నాయి. అయితే ఇందులో బి.1.617 వేరియర్ భారత్‍కు చెందిన వేరియంట్ గా పేర్కొనడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ భారత్‍దే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‍ఓ) ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. వైరస్‍లు, వాటి రూపాలను బట్టి దేశాల పేర్లతో గుర్తించడం లేదని డబ్ల్యూహెచ్‍ఓ తెలిపిందని పేర్కొంది. బి.1.617 భారత్ వేరియంట్‍గా కేవలం మీడియా సంస్థలు మాత్రమే పేర్కొంటున్నాయని మండిపడింది. భారత రకం కరోనా వైరస్ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‍ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది.
బి.1.617 వైరస్ పట్ల ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుదంటూ డబ్ల్యూహెచ్‍ఓ పేర్కొన్నట్లు, ఇది భారత్ వేరియంట్‍గా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిరాధారమని భారత్ ప్రకటనలో పేర్కొంది. డబ్ల్యూహెచ్‍ఓ తన 32 పేజీల నివేదికలో ఈ వేరియంట్ భారత్‍కు చెందినదని ఎక్కడా ప్రస్తావించలేదని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.