కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా-19 వ్యాక్సిన్ తొలి డోస్‍ను వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీలైనంత తర్వాగా వ్యాక్సిన్ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్‍తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇండియా టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లనుంది. ఆలోపే ఆ టీమ్‍లోని ప్లేయర్స్ అందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కరోనాపై ముందు వరసులో ఉండి పోరాడుతున్న వైద్యులు, మిగతా సిబ్బందిని విరాట్ కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు.