అగ్రరాజ్యంలో కరోనా విశ్వరూపం

కరోనా మహమ్మారి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే 2001 సెప్టెంబర్ 11 నాటి దాడిలో కంటే, ఇప్పుడు 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఒక్క రోజే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి దాడిలో 2,977 మంది మరణిస్తే, ఇప్పుడు ఒకే రోజు కరోనా 3,054 మంది అమెరికన్ ల ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా మే 7న 2,769 మంది మరణించడం ఒక రికార్డు అయితే ఇప్పుడు ఒక్కసారిగా 3 వేలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‍తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సైతం లక్షా 6వేల 688 చేరుకుంది. ఒక్క రోజే 2,26,533 కేసులు నమోదయ్యాయి.