కొవాగ్జిన్ టీకాకు.. అమెరికా షాక్

భారత్ బయోటెక్‍కు చెందిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‍డీఏ) స్పష్టం చేసింది. టీకా భద్రత, ప్రభావశీలత, రోగ నిరోధక ప్రతిస్పందనకు సంబంధించి తగినంత సమాచారం అందుబాటులో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీకాలను పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసే బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్‍ఏ) పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేసింది.